Header Banner

ఈ జిల్లాలోని నిరుద్యోగులకు సూపర్ న్యూస్! రూ.20 వేల జీతంతో! ఈ ఒక్క రోజే ఛాన్స్!

  Tue Feb 04, 2025 08:00        Employment

యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వం. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా జాబ్ ఆఫర్లు అందిస్తోంది. పదో తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. 

 

కర్నూలు జిల్లా కేంద్రంలోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న న్యాక్ సెంటర్ లో ఈరోజు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో 4 ప్రముఖ కంపెనీలైన క్రీమి స్టోన్స్, ఫోన్ పే, వంటి వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. 

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దీనికోసం పదవ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈరోజు అనగా 04-02-2025 వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్నూలు జిల్లా కేంద్రంలోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న న్యాక్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 20,000 వేల రూపాయల, వసతి కూడా కలిపిస్తారని తెలిపారు. 

 

అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9676141731 సంప్రదించాలని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Employment #Jobs #Employer #Youth